పోలీసులు ఆనందయ్యను రహస్య ప్రాంతానికి ఎందుకు తరలించారు?

పోలీసులు ఆనందయ్యను రహస్య ప్రాంతానికి ఎందుకు తరలించారు?

ఆర్.బి.ఏం డెస్క్: కరోనాను విరుగుడు మందు కనిపెట్టిన ఆనందయ్య పేరు తెలియని వారు ప్రస్తుతం ఎవరు లేరనే చేపోచ్చు. ప్రైవేటు ఆస్పత్రులో లక్షల రూపాయలు కార్చు పెట్టిన చివరకు ప్రాణాలను కాపాడుకోలేక పోతునారు. కరోనా బారిన పడి ఆసుపత్రికి వెళితే తిరిగి వస్తాం అనే నమ్మకం ప్రజల్లో పూర్తిగా నశించింది. ప్రపంచంలో వైద్యం ఎంత అభివృద్ధి చెందిన కూడా ప్రస్తుతం కరోనా పంజా నుండి రక్షించలేని పరిస్తితి ఏర్పడింది. ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు సైతం కరోనాను అంతం చేయలేక నిస్సహాయ స్థితిలోకి పడిపోయాయి.

ప్రైవేటు ఆసుపత్రులో లక్షలు కార్చుపెట్టిన ప్రాణాలను కాపాడుకోలేకపోతున్న ఈ క్రమంలో రూపాయి కార్చు లేకుండా కరోనా బారిన పడిన వారికి వైద్యాని అందిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్న ఆనందయ్య. వనములికాలతో చేసిన కరోనా విరుగుడు మందును ఉచితంగా పంపిణీ చేస్తూ ఆనందయ్య ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు.కేవలం ఒక గ్రామనికే అంకితమైన తన నాటు వైద్యం ఇప్పుడు దేశ వ్యాప్తంగా పేరుగాంచింది. ఆనందయ్య చేసే నాటు వైద్యానికి ఎలాంటి దుష్ఫలితలు ఉండవ్ అని ఆయన వద్ద వైద్యం తీసుకున వారు ఎంతో మంది స్పస్టం చేశారు.

ఆనందయ్య కరోనా వైద్యం వెలుగులోకి రావడంతో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ మందుపై పరిశోదనలను ముమ్మరం చేసింది. ఆనందయ్య చేసిన కరోనా విరుగుడు మందుతో ప్రజలకు ఎలాంటి దుష్ఫలితలు సంభవించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే ఆ మందును ప్రజలకు అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. ఈ మందుపై ఇప్పటికే క్లినికల్ ట్రైల్స్ జరుగుతునాయి. ఫలితాలు వెలుబడిన వెంటనే ప్రభుత్వం ఈ మందును అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం ఉనట్టు సమాచారం.

కాగా గత కొద్ది రోజుల నుండి ఆనందయ్య పోలీసుల అధీనంలో ఉన్నాడు. శుక్రవారం రోజు ఆయనను తన స్వగ్రామానికి పోలీసులు చేర్చారు. ఈ రోజు ఉదయం ఆనందయ్య ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ గ్రామంలోకి పోలీసులు భారీగా చేరుకోవడంతో గ్రామస్తులు బయాందోళనకు గురయ్యారు. ఆనందయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కోసమే పోలీసులు భారీ తన ఇంటి వద్దకు చేరుకున్నారని గ్రామస్తులు ఆందోళన చెందారు.

ఈ క్రమంలో పోలీసులకు గ్రామస్తులకు కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పి అక్కడి నుండి వారిని పంపించేశారు. పరిస్తితి సద్గుమనడంతో పోలీసులు ఊపిరి పిల్చుకున్నారు. ఆనందయ్యను పోలీసులు భారీ బందోబస్తు మద్యలో తన నివాసం నుండి రహస్య ప్రాంతానికి పోలీసులు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆనందయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోవద్దని అన్నారు. ఎందుకు తీసుకుపోతారో తమకు చెప్పాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

ఇంతకు ఆనందయ్యను పోలీసులు భారీ బందోబస్తు మద్య ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? రహస్య ప్రాంతానికి తరలించడానికి కారణాలు ఏంటి? రాష్ట్రంలో ఏం జరగబోతోంది అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి నోట వినిపిస్తునాయి. కాగా ఈ రోజు ఆనందయ్య మందుకు అయూష్ శాఖ తుది నిర్ణయం ప్రకటించనుంది.

Leave a Reply

Your email address will not be published.