కాంగ్రెస్ నేత హనుమంత్ రావుకు కే‌సి‌ఆర్ నో అపాయింట్మెంట్..

కాంగ్రెస్ నేత హనుమంత్ రావుకు కే‌సి‌ఆర్ నో అపాయింట్మెంట్..

ఆర్.బి.ఏం డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ని కలవడానికి ప్రగతి భవన్ కు వెళ్ళిన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత్ రావు. ఈ రోజు ఉదయం కే‌సి‌ఆర్ ను కల్వడంకోసం ప్రగతి భవన్ కి హనుమంత్ రావు వెళ్లారు. కే‌సి‌ఆర్ ను కలవడానికి అపాయింట్మెంట్ కోరిన హనుమంత్ రావు కానీ ప్రగతి భవన్ లో కే‌సి‌ఆర్ ను కలవడానికి అనుమతి దొరకలేదు. ప్రగతి భవన్ లోనే కొద్ది సేపు నిరీక్షించిన హనుమంత్ రావు. కే‌సి‌ఆర్ ను కలవడానికి అధికారులు నిరాకరించడంతో హనుమంత్ రావు వెనుతిరిగి వెళ్ళిపోయారు.

ఈ క్రమంలో హనుమంత్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం కే‌సి‌ఆర్ ను కలవడం కోసం వచ్చిన నాకు ఆయన అపాయింట్మెంట్ నిరాకరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు వస్తే అపాయింట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకుంటునరాని అన్నారు. కరోనా తో ప్రజల జీవితాలు దారుణంగా మరాయని ఆయన అన్నారు. ఒకవైపు ఆసుపత్రులో పడకలు లేక బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. కరోనా బారిన పడి ప్రాణాలను కాపాడుకోవాలని ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే అక్కడి యజమాన్యం ప్రజల ప్రాణాలతో చాలగటం ఆడుతూ వారిని నిలువు దోపిడి చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులో కరోనా కు మెరుగైన వైద్యం చేయాలని ఆయన అన్నారు, ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేకే ప్రజలకు ప్రైవేటు ఆసుపత్రుల వైపు వెళుతూ తమ ఆస్తులను అమ్ముకోవాలిసి వస్తోందని ఆయన అన్నారు.

ప్రజా సమస్యలపై చర్చించేందుకు కే‌సి‌ఆర్ తో మాట్లాడాలని ఎన్నో సార్లు ప్రగతి భవన్ కి వచ్చిన ఆయన ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నాతో మాట్లాడడానికి కే‌సి‌ఆర్ కు అంతా భయం ఎందుకు అని ఆయన అన్నారు. ప్రజల వైపు నుండి ప్రశ్నిస్తే కే‌సి‌ఆర్ లెక్క చేయడం లేదని హనుమంత్ రావు ఆరోపించారు. కే‌సి‌ఆర్ కు ప్రజా సమస్యల పై ఎన్నో లేఖ లు రాశాను అని ఆయన అన్నారు. కే‌సి‌ఆర్ మాకు  ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు అని ఆయన అన్నారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పక్షాలతో కలిసి ప్రజల సమస్యలపై చర్చించాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన తెలిపారు. కరోనా తో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలబడి బాధిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని వి.హనుమంత్ రావు ప్రభుత్వాని డిమాండ్ చేశారు.

కరోనా ట్రీట్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చి వారిని ఆదుకోవాలని ఆయన అన్నారు. కరోనాకు ఎంతో మంది బలి అవుతునారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవలని హనుమంత్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్తితులో ప్రజలకు సేవ చేయాల్సింది పోయి అనవసర రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని వి.హనుమంత్ రావు స్పస్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published.