గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ఉధృతికి కారణాలు ఇవేనా..

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ఉధృతికి కారణాలు ఇవేనా..

ఆర్.బి.ఏం డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృస్టించి, మనవాళిని బయాందోళనకు గురిచేస్తున్న కరోనా మహమ్మారి.ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి.. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే లోక్ డౌన్ ను అమలు చేశారు. లాక్ డౌన్ అమలు చేసిన రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కరోనా దాటికి ఎంతో మంది బలైయ్యారు.

హైదరాబాద్ పై కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండేది రోజుకు ఎన్నో వందల కేసులు GHMC పరిధిలో నమోదైయేవి. కాగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో రోజు రోజుకు GHMC పరిధిలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయి. ప్రజలు నిబంధనలకు కట్టుబడి ప్రభుత్వానికి సహకరిస్తూ కరోనా వ్యాప్తిని కట్టడి చేస్తున్నారు.కరోనా మొదటి దశలో కొంత అప్రమత్తంగా లేకపోవడం వల్లే కరోనా సెకండ్ వేవ్ ముంచుకొచ్చి ప్రజల ప్రాణాలను తన పంజాకు బలి తీసుకుంది. కాగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కరోనాపై అవగాహన తెచ్చుకొని అప్రమత్తంగా ఉంటూ దాని అంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

GHMC పరిధిలో కరోనా వ్యాప్తి తగ్గడానికి లాక్ డౌన్ ఒక అస్త్రం అయితే దాని సరైన పద్దతిలో పోలీసులు అధికారులు అమలు చేయడం మరో అస్త్రంగా మారింది. ఉదయం పది గంటల తరువాత అనవసరంగా రహదారుల పై కి వచ్చే వారి పట్ల పోలీసులు కటినంగా వ్యవహరిస్తూ వారి వాహనాలు స్వాధీనం చేసి కేసులు నమోదు చేస్తున్నారు. సడలింపులు ఇచ్చిన రంగాలకు మినహా ఇతర రంగాల వారికి లాక్ డౌన్ అమలు చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తికి కారణం..?

కరోనా వ్యాప్తి మొదటి దశలో GHMC పరిధిలో అధికంగా నమోదైయింది. కొంత మేరకు ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యం వహించడంతో కరోనా సెకండ్ వేవ్ లో కరోనా విజృంబన మరింత వేగంగా వ్యాప్తి చెందింది. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించి కఠినమైన చర్యలు చెప్పటడంతో జి‌హెచ్‌ఎం‌సి పరిధిలో కరోన కేసులు తగ్గుముఖం పట్టాయి. కాగా గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశలో కరోనా వ్యాప్తి అత్యల్పంగా నమోదైంది. ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్లో గ్రామీణ ప్రాంతాలను సైతం తన వశం చేసుకుంది.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మొదటి దశలో కొంత అప్రమత్తంగా ఉన్నందున కరోన వ్యాప్తి గ్రామాలో అంతగా ప్రభావం చూపలేదు. కరోన సెకండ్ వేవ్లో గ్రామీణ ప్రాంత ప్రజలు కొంత నిర్లక్ష్యం వహించండం వల్లే కరోనా విజృంబన అధికంగా అయిందని పలువురు పేర్కొన్నారు. దీనికి ముఖ్య కారణం సామాజిక దూరం పాటించకుండా భాహిరంగ ప్రదేశాల్లో తిరగడం వల్లే అని కొందరు వ్యక్యానిస్తున్నారు. కరోనా సోకిన వారు కూడా భాహిరంగ ప్రదేశాల్లో అందరితో కలిసి తిరగడం వల్లే అని వారు అన్నారు.నగరంలో ఎలాగైతే లాక్ డౌన్ ను అమలు చేశారో అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా లాక్ డౌన్ అమలు చేయాలని పలువురు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published.