ఎంపీగా పోటీ చేయడంపై నాగార్జున క్లారిటీ..

ఎంపీగా పోటీ చేయడంపై నాగార్జున క్లారిటీ..

హైదరాబాద్: విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరపున హీరో అక్కినేని నాగార్జున పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎందుకంటే సీఎం జగన్‌తో నాగార్జున చాలా సన్నిహితంగా ఉంటారు. అందువల్ల ఆయనను విజయవాడ నుంచి బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని నాగార్జున స్పష్టం చేశారు. తాను వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తాన్నన్న వార్తలను ఖండించారు. 15 ఏళ్లుగా ఇలాంటి ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయని, ఆ ప్రచారాలను తాను పట్టించుకోనని తెలిపారు. రాజకీయాలకు నాగార్జున దూరంగా ఉన్న వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రకటనల్లో నాగార్జున కనిపించడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఆ తర్వాత జగన్ వైసీసీని స్థాపించినప్పుటి నుంచి ఆయనతో నాగార్జున సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం సినిమా టకెట్ల తగ్గించడంపై సినీ పెద్దలందరూ వ్యతిరేకించారు. కానీ నాగార్జున మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ క్రంమలోనే ఆయనను వైసీపీలోకి ఆహ్వానించారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ ప్రచారాన్ని నాగార్జున ఖండించడంలో తెరపడింది.

Leave a Reply

Your email address will not be published.