బాలకృష్ణ కనిపింపచడం లేదంటూ..హిజ్రాల ఫిర్యాదు

అనంతపురం: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనిపించడం లేదని  పోలీస్ స్టేషన్ లో హిజ్రాలు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఫై వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై బాలకృష్ణ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటె తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కనిపించడంలేదని మా సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి అని కొంతమంది హిజ్రాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హిందూపురంలో బాలకృష్ణ ఉండటం లేదంటూ, అసలు మా సమస్యలను పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో హిజ్రాలు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.