రహదారి ప్రమాదంపై స్పందించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

రహదారి ప్రమాదంపై స్పందించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం: ప్రమాద సంఘటనల పట్ల స్పందించడం ఆయన నైజం. ప్రమాదం తన కళ్లెదురుగా జరిగితే ఆ సంఘటన పట్ల స్పందించే తీరు మరింత వేగంగా ఉంటుంది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల వారి ఆరోగ్య పరిస్థితుల కోసం ఆయన పడే తపన ఆయనలోని మనసున్న మానవత్వాన్ని తట్టి చూపుతుంది. గతంలో జరిగిన సంఘటనలతో పాటు రాయచోటి రూరల్ మండల పరిధిలోని యండపల్లె క్రాస్ వద్ద జరిగిన సంఘటన పట్ల ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి స్పందించిన తీరు ఆయనలోని మానవత్వం, ప్రేమాభిమానాలు వెలకట్టలేనివిగా కనిపించాయి. పూర్తి వివరాలకు వెళితే…

రాయచోటి పట్టణంలోని సాయి హాల్ సమీపంలోని సరస్వతి నగర్ కు చెందిన సునీల్, మానస భార్యాభర్తలు కలసి గాలివీడు మండలం గోరాన్ చెరువు గ్రామంలో జరిగిన తిరుణాలను చూసుకుని బైక్ పై నుంచి వైపు వెల్లుచుండగా ఎగువ అబ్బవరం పెద్ద కాల్వపల్లె వద్దఉన్న అర్చన విద్యాసంస్థల సమీపంలో ముందువైపు వెల్లుచున్న రాళ్ళలోడుతో వెల్లుచున్న ట్రాక్టర్ లో నుంచి ఓ రాయి సునీల్ పై పడడంతో బైక్ అదుపుతప్పి భార్యాభర్తలిద్దరూ కిందపడ్డారు. సునీల్ కు రాయి తగలడం వల్ల ముఖంపై తీవ్రగాయమైంది.వారి భార్య మానసకు గాయాలయ్యాయి.

అదే సమయంలో అటుగా గాలివీడు పర్యటనకు వెళ్తున్న శ్రీకాంత్ రెడ్డి సంఘటనను చూసి స్పందించి,క్షతగాత్రుల పరిస్థితులును చూసి, వారికి మనో ధైర్యం కల్పించి,వారిని దగ్గరుండి రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తన సొంత వాహనంలో తరలింపచేశారు. వారికి త్వరితగతిన మెరుగైన వైద్యం అందించాలని ఏరియా ఆసుపత్రి వైద్యాధికారులును కూడా శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు.క్షతగాత్రులకు ఏరియా ఆసుపత్రి వైద్యులు త్వరితగతిన వైద్యం అందించి మరింత మెరుగైన వైద్యం కోసం కడప సర్వజన ఆసుపత్రికి 108 వాహనంలో పంపారు. క్షతగాత్రులను రాయచోటి ఏరియా ఆసుపత్రికి పంపిన తన వాహనం తిరిగి వచ్చే౦తవరకు శ్రీకాంత్ రెడ్డి ప్రమాద సంఘటన ప్రాంతంలో వేచియున్నారు. ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి స్పందించిన తీరుపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.