విశాఖపట్నంలో గ్యాంగ్ రేప్..
ఆర్.బి.ఎం విశాఖపట్నం: ఎన్ని చట్టాలు తెచ్చిన మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నారు. రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు అధికమవుతున్నాయి. ఓ మానసిన దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది. నగరంలో మానసిక దివ్యాంగురాలపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులకు ఓ మహిళ సహకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం వెతుకుతున్నారు.