ఏపీలో కరోనా విలయతాండవం.. తాజాగా ఎన్ని కేసులంటే?

ఏపీలో కరోనా విలయతాండవం.. తాజాగా ఎన్ని కేసులంటే?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్:

దేశంలోనే కరోనా క్రమంగా పెరుగుతోంది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. రాష్ట్రంలో కొత్తగా 31325 శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహించగా 997 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,96,917కు చేరింది. ఈ కరోనా మహమ్మారి బారినపడి కొత్తగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7210 కు చేరాయని వ్యిద్యాధికారులు వెల్లడించారు. తాజాగా మరో 282 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. మొత్తం రాష్ట్రంలో కారొనను ఎదుర్కొని కోలుకున్న వారి సంఖ్య 886498కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,104 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు.

కరోనా మహమ్మారి తీవ్రత వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి తిరగాలని పలు సూచనలు రాష్ట్ర ప్రభత్వం చేసింది. కారొనను అంత సులువుగా తీసుకోవొద్దని దాని వ్యాప్తి చాల ప్రమాదమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.