మాస్క్ పెట్టుకోకపోతే రూ.1000 జరిమానా
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. భహిరంగ ప్రదేశాల్లో బస్సులో, ఆటోలలో, ట్రైన్లలో, షాప్స్, మాల్స్ తదితర ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి అని ప్రభుత్వం ఆదేశాలను జారీచేసింది. ఈ క్రమంలో పోలీసులు పూర్తిగా ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను కట్టినగా అమలు చేస్తున్నారు. తాజాగా ఒక్క వ్యక్తి మాస్క్ లేకుండా భహిరంగ ప్రదేశంలో తిరుగుతుండగా సదరు వ్యక్తికి పోలీసులు రూ .1000 జరిమానా విధించారు. షాప్స్ లోకి మాల్స్ లోకి కస్టమర్లను మాస్క్ లేకుండా అనుమతిస్తే రూ.2000 జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీచేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ హైదరాబాద్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తాం అని తెలిపారు.