అందనంత దూరంలో ‘వకీల్ సాబ్’ మూవీ టిక్కెట్ల ధర.. ఎంతో తెలుసా?
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త మూవీ వకీల్ సాబ్ గురుంచి అందరికి తెలిసిన విషయమే. వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు అయితే ఈరోజు ఈ మూవీ కి సంబందించి ట్రైలర్ హోలీని పురస్కరించుకొని విడుదల చేయనున్నారు. ఇప్పటికే నెట్టింలో పవన్ కళ్యాణ్ అభిమానులు #VakeelSaabTrailerDay హ్యాష్ ట్యాగ్‌తో పేరుతో ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. వకీల్ సాబ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నటు టాలీవుడ్ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వకీల్ సాబ్ సినీ నిర్మాత దిల్ రాజు భారీ అంచనాలతో మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.
వకీల్ సాబ్ సినిమా విడుదలకు ముందు రోజు అర్థరాత్రి విశాఖలోని కొన్ని సినిమాహాలలో 12 గంట నుంచి మూడు మిడ్‌నైట్ షోలను నడపనున్నారు . మిడ్ నైట్ షోలను అభిమానుల షో గా వ్యవహరిస్తుంటారు.అలంటి షో ఈ టికెట్ ధర ఎక్కువ భారీ మొత్తంలో ఉండబోతోంది అని తెలుస్తోంది.
ఈ మిడ్ నైట్ షో కి సంబంధించి ఒక్క టికెట్ ధర 1500 రూపాయలు ఉండబోతోందని అన్నారు. బెనిఫిట్ షోకి సంబంధిచిన టికెట్ ధర రూ.500 గా నిర్ణయించారు. అదేవిధంగా మిగితా ప్రాంతాలలో మొదటివారంలో టికెట్ ధర రూ.200 గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. టికెట్ ధర అధికంగా ఉండటంతో వకీల్ సాబ్ మూవీ రికార్డు సాధిస్తుందని భారీ అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఇదిలా ఉంటె సామాన్య ప్రేక్షకులకు టికెట్ ధరలు అందనంత దూరంలో ఉన్నాయని ఎన్నో ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఈ మూవీ ఏప్రిల్ 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.