మంత్రి గౌతమ్ రెడ్డి కన్నుమూత.. హూటాహుటిన ఏపీ సీఎం జగన్ హైదరాబాద్‌కు

మంత్రి గౌతమ్ రెడ్డి కన్నుమూత.. హూటాహుటిన ఏపీ సీఎం జగన్ హైదరాబాద్‌కు

ఆర్.బి.ఎం హైదరాబాద్: మంత్రి మేకతోటి గౌతమ్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఈ రోజు ఉదయం గుండెపోటు రావడంతో జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రితో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన మృతి చెందిన విషయాన్ని వైద్యులు ఆయన సతీమణికి సమాచారం ఇచ్చారు. గౌతమ్ రెడ్డి వారం రోజుల పాటు దుబాయ్ పర్యటించారు. ఈ పర్యటనలో ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి ఆయన పలు కీలక ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ పర్యటన ముగించుకుని ఆయన ఆదివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఇంతలోనే ఇంత ఘోరం జరుగడంతో గౌతమ్ రెడ్డి కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గౌతమ్ రెడ్డి మరణవార్త విన్న సీఎం జగన్ తీవ్ర విషాదంతో మునిగిపోయారు. హూటాహుటిన జగన్ హైదరాబాద్‌కు బయలుదేరారు.

గౌతమ్ రెడ్డి 1971 నవంబర్ 2న జన్మించారు. ఆయనది నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లి స్వగ్రామం. గౌతమ్ రెడ్డి 2014 అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ రంగప్రవేశం చేశారు. మొదటిసారి ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా సిట్టింగ్ స్థానం నుంచే విజయం సాధించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గౌతమ్ రెడ్డికి  జగన్ తన కేబినెట్‌లో చోటు కల్పించారు. ప్రస్తుతం ఆయన పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.