ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన నందమూరి కుటుంబం…

ap cm ys jaganmohan reddy

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన నందమూరి కుటుంబం…

ఆర్.బి.ఎం డెస్క్  హైదరాబాద్: ఏపీలో ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుపై నందమూరి కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ పేరిట జిల్లా ఏర్పాటును స్వాగతిస్తున్నామని నందమూరి రామకృష్ణ ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం తెలుగోడు గర్వపడే విధంగా తీసుకున్న నిర్ణయమిదని కొనియాడారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎర్రకోటపై ఎగరేసిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి నందమూరి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

పదమూడు జిల్లాల ఏపీని, ప్రభుత్వం 26 జిల్లాలుగా విస్తరించింది. 13 కొత్త జిల్లాలతో పాటు 12 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రభుత్వం నోటిఫికికేషన్‌ విడుదల చేసింది. అయితే కొత్త జిల్లాల్లో ఓ జిల్లాకు మాజీ సీఎం ఎన్టీఆర్ పేరు పెట్టడం గమనార్హం. ఎన్టీఆర్ జిల్లా హెడ్‌క్వార్టర్‌ విజయవాడ. ఈ జిల్లాలో నందిగామ. తిరువూరు. విజయవాడను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు. నందిగామలో 7 మండలాలు, తిరువూరులో 7 మండలాలు, విజయవాడలో 6 మండలాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published.