నాలో నేను సినిమాను నిషేధించాలని గౌడ సంఘ నాయకులు సదాశివపేట పోలీస్ స్టేషన్లో పిర్యాదు..

నాలో నేను సినిమాను నిషేధించాలని గౌడ సంఘ నాయకులు సదాశివపేట పోలీస్ స్టేషన్లో పిర్యాదు..

ఆర్.బి.ఎం సదాశివపేట: నాలో నేను సినిమాను నిషేధించాలని సదాశివపేట పోలీస్ స్టేషన్లో సంగారెడ్డి జిల్లా కల్లుగీత కార్మిక సంఘం, గౌడ సంఘం, జై గౌడ సంఘాల ఆధ్వర్యంలో  సినిమాపై కేసు నమోదు చేయాలనీ సిఐ సంతోష్ కుమారు కు వినతి పత్రం అందజేశారు.

గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ.. నాలో నేను సినిమా కల్లుగీత వృత్తి చేసుకునే మహిళలను అవమానించే విధంగా చిత్రీకరించారని తమ గౌడ మహిళలను కించపరిచే విధంగా సినిమాను ఉందని వారు పేర్కొన్నారు. గౌడ కులస్థుల మనోభావాలు దెబ్బతినేలా సినిమాను చిత్రీకరించారని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో సినిమా తీసిన వారిపై,ఆ వీడియోలను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐ సంతోష్ కుమార్ ను కోరామని గౌడ నాయకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.