చిరంజీవిని పరామర్శించిన కెసిఆర్..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. కరోనా బారిన పడ్డ చిరంజీవిని ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అంతేకాకుండా చిరంజీవి కుటుంబ సభ్యులతో కూడా కేసీఆర్ మాట్లాడారు. మంగళవారం చిరంజీవికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన పరీక్ష చేయించుకున్నారు. దీంతో చిరంజీవికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం చిరంజీవి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇదే విషయాన్ని తనకు కరోనా సోకిందని ట్వీట్టర్‌లో చిరంజీవి తెలిపారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డానని తెలిపారు. తనకు స్వల్ప లక్షణాలున్నాయని, అందువల్ల ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. థర్డ్ వేవ్‌లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల నటుడు మహేష్‌బాబు, శ్రీకాంత్, మంచులక్ష్మి, విశ్వక్ సేన్, థమన్ కరోనా బారిన పడ్డారు.