నాణ్యమైన విద్యుత్ అందేలా చూడాలి: శ్రీకాంత్ రెడ్డి

నాణ్యమైన విద్యుత్ అందేలా చూడాలి: శ్రీకాంత్ రెడ్డి

  • వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటులోరైతుల నుంచి కాంట్రాక్టర్లు కానీ, అధికారులు, సిబ్బంది ఏ ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా చర్యలు చేపట్టండి..
  • ఏపిఎస్ పి డి సి ఎల్ ఎస్ఈ కి సూచించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

ఆర్.బి.ఎం డెస్క్: ప్రజలకు ,రైతులకు నాణ్యమైన విద్యుత్ అందేలా చూడాలని ఏపిఎస్ పి డి సి ఎల్ ఎస్ఈ కి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. బుధవారం కడపలో చీఫ్ విప్ ను ఏపిఎస్ పి డి సి ఎల్ పర్యవేక్షక ఇంజనీర్ శోభా వాలేంటీనా మర్యాదపూర్వకంగా కలిశారు.నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలపై ఎస్ఈ తో చీఫ్ విప్ చర్చించారు. రాయచోటి నియోజక వర్గానికి నూతనంగా మంజూరైన 1300 వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లును నవంబర్ లోగా పూర్తిగా అందచేయాలన్నారు. మెటీరియల్స్ ను కూడా త్వరితగతిన అందించాలని సూచించారు. ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటులో రైతుల నుంచి కాంట్రాక్టర్లు కానీ, అధికారులు, సిబ్బంది కానీ ఏ ఒక్క రూపాయి లంచం తీసుకున్నా సహించేది లేదని హెచ్చరించారు. రైతులకు పగటిపూట 9 గంటలు విద్యుత్ సరపరాను జగన్ ప్రభుత్వం అందిస్తోందన్నారు.గత ప్రభుత్వం విద్యుత్ బకాయులు చెల్లించక పోయినా ఈ ప్రభుత్వం చెల్లించి విద్యుత్ సమస్యలు లేకుండా చేసిందన్నారు.గాలివీడు మండలంలోని బండివాండ్లపల్లె 133 సబ్ స్టేషన్ నిర్మాణాలపై ఎస్ ఈ తో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చర్చించారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకటసుబ్బయ్య, ఏడి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.