ప్రగతిభవన్ ను.. బహుజన భవన్ గా మారుద్దాం: RS ప్రవీణ్ కుమార్
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే టీఆరెస్ ప్రభుత్వానికి దళితుల మీద ప్రేమ పుట్టుకొస్తుందని బీఎస్పీ కో ఆర్డినేటర్ RS ప్రవీణ్ కుమార్ కరీంనగర్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఏడేళ్లు అవుతుందని ఈ ఏడేళ్ళల్లో ఎస్సీ కార్పొరేషన్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు మంజూరు చేశారో చెప్పాలి అని ఆరేస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. దళితులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెరాస ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాల పొలం ఇవ్వకపోగా తరతరాలుగా పేదలు అనుభవిస్తున్న అసైన్డ్ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని ఆరేస్ ప్రవీణ్ కుమార్ టీఆరెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
నగరంలో ఉన్న ప్రగతి భవన్ ను బహుజన భవన్ గా మారుద్దాం అని ఆరేస్ ప్రవీణ్ కుమార్ అన్నారు . కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి ని బయటపెట్టాలని ఆరేస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.