గంజాయి పంట పండిస్తా అనుమతులు ఇవ్వండి అంటూ కలెక్టర్ కు లేఖ రాసిన రైతు..

గంజాయి పంట పండిస్తా అనుమతులు ఇవ్వండి అంటూ కలెక్టర్ కు లేఖ రాసిన రైతు..

ఆర్.బి.ఎం డెస్క్: ఓ రైతు తన పొలంలో ఏ పంట వేసిన లాభాలు రాకపోవడంతో తీవ్రకంగా నష్టపోతునాని వినూత్నంగా ఆలోచించాడు. తన పొలంలో ఏ పంట వేసిన మార్కెట్లో మంచి ధర ఉండటం లేదంటూ ఆ రైతు ఆవేదన చెందాడు.పంటకు పెట్టిన డబ్బులు కూడా తిరిగి రాకపోవడంతో మార్కెట్లో దేనికి డిమాండ్ బాగా ఉందొ అని తెలుసుకున్నాడు.  మహారాష్ట్రకు చెందిన అనిల్ అనే రైతు కలెక్టర్ కు దిమ్మతిరిగే లేఖను రాశాడు. తన పొలంలో ఏ పంట పెట్టిన లాభాలు రాకపోవడంతో పైగా నష్టపోతునాని తన పొలంలో గంజాయి సాగు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని గంజాయికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అనిల్ పాటిల్ అనే రైతు కలెక్టర్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. వచ్చే నెల సెప్టెంబర్ 15 తేదీ లోపు తన లేఖకు రిప్లై ఇవ్వాలని రిప్లై ఇవ్వకపోతే గంజాయి సాగు చేసుకోవడానికి అనుమతులు వచ్చినట్లుగా భావిస్తానని అనిల్ పాటిల్ అనే రైతు కలెక్టర్ కు రాసిన లేఖలో పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published.