వైఎస్ఆర్ కుటుంబాన్ని మరువం..

వైఎస్ఆర్ కుటుంబాన్ని మరువం…

మాజీ కౌన్సిలర్, మాజీ జెడ్ పి కో అప్షన్, మాజీ కో ఆప్షన్ సభ్యులు పలువురు వైఎస్ఆర్ సిపి లో చేరిక

ఆర్.బి.ఎం డెస్క్ :వైఎస్ఆర్ కుటుంబాన్ని ఎప్పటికీ మరువమని నూతనంగా పార్టీలో చేరిన మాజీ కౌన్సిలర్ , మాజీ జెడ్ పి కో అప్షన్ సభ్యుడు, మాజీ కో అప్షన్ సభ్యులు పేర్కొన్నారు. గురువారం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో రాయచోటి మున్సిపాలిటీకి చెందిన మాజీ కౌన్సిలర్లు సయ్యద్ షబ్బీర్,మాజీ జెడ్ పి కో అప్షన్ సభ్యుడు హసన్ బాషా, మాజీ మున్సిపల్ కో అప్షన్ సభ్యులు జాఫర్ అలీ ఖాన్, రాజా పైపుల యజమాని మకబుల్,ఎరువుల అంగడి మూసా, మైనారిటీ నాయకులు రహంతుల్లా, నవాబ్ జాన్ ఇనాముల్లా, రమణ, వీరబల్లె మహమ్మద్ అలీ, మహబూబ్ బాషాలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి చీఫ్ విప్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన వారు మాట్లాడుతూ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామన్నారు.పార్టీ అభివృద్ధికోసం అహర్నిశలు కృషిచేస్తామన్నారు.దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్ స్మరించుకుంటూ, సీఎం జగన్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలును ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు.చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత నాయకులకు వై ఎస్ ఆర్ కుటుంబంతో ఎంతో అనుబంధాలు ఉన్నాయన్నారు. సమిష్టి కృషితో అటు పట్టణాన్ని ఇటు పార్టీని అభివృద్ధి చేసుకుందామన్నారు.

ఘన స్వాగతం
పార్టీలో చేరికల కార్యక్రమాలకు విచ్చేసిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కి పార్టీలో చేరుతున్న నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ లు దశరథ రామిరెడ్డి, ఫయాజర్ రెహమాన్,మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాషా, జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి, వై ఎస్ ఆర్ సిపి నాయకులు హాబీబుల్లా ఖాన్, ఫయాజ్ అహమ్మద్ ,బేపారి మహమ్మద్ ఖాన్, జాకీర్, కొలిమి ఛాన్ బాషా,అలీనవాజ్ ఖాన్, మదన మోహన్ రెడ్డి,ఆసీఫ్ అలీఖాన్,గౌస్ ఖాన్, రియాజ్, అంజాద్ అలీఖాన్,తబ్రెజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.