విత్తన నిల్వల మరియు శుద్దీకరణ గోదాము శంఖుస్థాపనలో పాల్గొన్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

విత్తన నిల్వల మరియు శుద్దీకరణ గోదాము శంఖుస్థాపనలో పాల్గొన్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

ఆర్.బి.ఎం డెస్క్: రూ 49 లక్షల నిధుల వ్యయంతో నిర్మించనున్న విత్తన నిల్వ మరియు శుద్దీకరణ గోదాము శంఖుస్థాపనలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. గురువారం రాయచోటి పట్టణం సమీపం దిగువ అబ్బావరం ప్రాంతంలో సాయి ఇంజనీరింగ్ కళాశాల వెనుకభాగంలో రూ 49 లక్షలుతో నిర్మించనున్న విత్తనశుద్ధి మరియు శుద్దీకరణ గోదాము నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒక సీజన్ లో 30 వేల క్వింటాళ్ల విత్తనాలను శుద్దిచేయగల సామర్థ్యం కలిగిఉందన్నారు.విత్తన శుద్దివల్ల రైతులు మంచిదిగుబడి పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను మెరుగుపరిచేందుకు రైతులకు నిరంతరం మార్గదర్శకత్వం వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. విత్తన శుద్ధి గోడౌన్ భవన నిర్మాణాలను నాణ్యతగా, త్వరితగతిన పూర్తిచేయాలని శ్రీకాంత్ రెడ్డి అధికారులుకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహామండలి జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి,సర్పంచ్ ప్రభావతమ్మ, విత్తన శుద్ధి శాఖ జిల్లా మేనేజర్ జగదీష్, డి ఈ రోశయ్య, ఏ ఈ సాయికృష్ణారెడ్డి, వై ఎస్ ఆర్ సిపి నాయకులు కోడి శ్రీనివాసులు రెడ్డి, తిరుపాల్ నాయుడు, సహదేవ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, చెన్నకృష్ణారెడ్డి, సుబ్రమణ్యం,శివయ్య నాయుడు, కాంట్రాక్టర్లు శంకర్ రెడ్డి, శివమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.