రాయచోటిని అన్నమయ్యజిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేస్తూ గెజిట్ విడుదలపై రాయచోటిలో వెల్లువెత్తిన హర్షాతిరేకాలు…
ఆర్.బి.ఎం రాయచోటి: రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల ప్రకటనలో అన్నమయ్య జిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజన్ గా రాయచోటి పేరు ప్రకటనతో రాయచోటిలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వినిపించాయి. మున్సిపాలిటీ పరిధిలో గురువారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. తొలుత మున్సిపల్ కార్యాలయం వద్ద సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి కొత్తపేట, మదనపల్లె రహదారి మార్గం, చెక్ పోస్ట్, బంగ్లా, బస్ట్ స్టాండ్, తహశీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో సీఎం జగన్, ఎంపి మిథున్, చీఫ్ విప్ శ్రీకాంత్, సీఎం అదనపు కార్యదర్శి ధనంజయరెడ్డి లపేరుతో నినాదాలు చేస్తూ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ర్యాలీలో అడుగడుగునా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.నేతాజీ సర్కిల్ లో మానవహారం నిర్వహించారు. నేతాజీ సర్కిల్ నుంచి బస్ స్టాండ్ రహదారి మార్గంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్, పొట్టిశ్రీరాములు, మహాత్మాగాంధీ, వైఎస్ఆర్ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్,జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లు చెన్నూరు అన్వర్ బాష, విజయ భాస్కర్,పి ఆర్ టియు రాష్ట్రగౌరవాధ్యక్షుడు శ్రీనివాసరాజు,వైఎస్ఆర్ సీపీ నాయకులు, కౌన్సిలర్లు మదన మోహన్ రెడ్డి,ఆసీఫ్ అలీఖాన్, కొలిమి ఛాన్ బాష, ఫయాజ్ అహమ్మద్, కసిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి,అన్నా సలీం, రౌనక్, నవరంగ్ నిస్సార్, అల్తాఫ్,రియాజ్, సాదిక్ అలీ,సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, పల్లా రమేష్, జానం రవీంద్ర యాదవ్,అల్తాఫ్,ఆనంద రెడ్డి, వెంకట్రామిరెడ్డి, భాస్కర్, జాఫర్ అలీ ఖాన్, రియాజుర్ రెహమాన్, జయరామ్ నాయక్, గౌస్ ఖాన్,గువ్వల బుజ్జిబాబు,సుగవాసి శ్యామ్,నాగేశ్వర రావు, గంగిరెడ్డి, కో ఆప్షన్ అయ్యవారు రెడ్డి,ఖాదర్ వలీ,ఆసీఫ్ అలీఖాన్, జావీద్, అమీర్, కొత్తపల్లె ఇంతియాజ్, ఏ వి రమణ తదితరులు పాల్గొన్నారు.