నాగచైతన్య సమంత విడాకుల నేపథ్యంలో నేను మాట్లాడినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం: నాగార్జున
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: నాగచైతన్య, సమంత విడాకులపై తాను మాట్లాడినట్లు వస్తున్న వార్తలు అవాస్తమని హీరో నాగార్జున ప్రకటించారు. తాను మాట్లాడలేదని, దయచేసి అబద్ధాలను నమ్మవద్దని కోరారు. ‘‘సోషల్ మీడియాలో నా పేరుతో వస్తున్న కామెంట్స్‌లో నిజంలేదు. సమంత-నాగచైతన్యల విషయంలో నేను మాట్లాడినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. పుకార్లను వార్తలుగా మార్చొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని అక్కినేని నాగార్జున ట్వీటర్ వేదికగా పేర్కొన్నారు.
అంతకుముందు ‘‘నాగచైతన్య, సమంత ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. గత ఏడాది ఇద్దరూ కొత్త సంవత్సర వేడుకలు సంతోషంగా చేసుకున్నారు. ఆ తర్వాతే వాళ్లిద్దరి మధ్య ఏదో సమస్య వచ్చింది. సమంతే ముందుగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె నిర్ణయానికి నాగచైతన్య అంగీకారం తెలిపాడు’’ అని నాగార్జున మాట్లాడినట్లు సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో వైరల్ అయింది. అయితే ఇవన్నీ పుకార్లేనని నాగార్జున కొట్టిపారేశారు. ఇలాంటి వార్తలను ఎవరూ పట్టించుకోవద్దని అభిమానులకు సూచించారు.