ఏపీ హై కోర్టులో రఘురామకృష్ణకు చుక్కెదురైంది..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు ఏపీ హై కోర్టులో చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వానికి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని శుక్రవారం నాడు ఆయనను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ రోజు అయన తరుపు న్యాయవాది ఏపీ హై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రఘురామకృష్ణ అరెస్ట్ విషయంలో హై కోర్ట్ జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ వారి బెయిల్ పిటిషను హై కోర్ట్ తిరస్కరించింది. ఇప్పుడునా పరిస్థితుల్లో రఘురామకృష్ణ కేసుపై జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తెలిపింది. ఈ కేసులో బెయిల్ కావాలంటే క్రింది కోర్టుకు వెళ్లాలని హై కోర్ట్ సూచించింది.