ఏపీ సీఐడీ కోర్టులో రఘురామకృష్ణంరాజు

ఏపీ సీఐడీ కోర్టులో రఘురామకృష్ణంరాజు

గుంటూరు: జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపైనా, ప్రభుత్వ పెద్దలపైనా తరుచు విమర్శల బాణాలు సంధిస్తున్న అధికార వైసిపి పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికి విదితమే. రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమైంది. ఏపీ సీఐడీ కోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు హాజరుపర్చారు.రఘురామకృష్ణరాజును ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు అధికారులు ప్రవేశపెట్టారు. కాగా ఈ రోజు అయన తరుపు న్యాయవాది ఏపీ హై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రఘురామకృష్ణ అరెస్ట్ విషయంలో హై కోర్ట్ జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ వారి బెయిల్ పిటిషను హై కోర్ట్ తిరస్కరించింది. ఇప్పుడునా పరిస్థితుల్లో రఘురామకృష్ణ కేసుపై జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తెలిపింది. ఈ కేసులో బెయిల్ కావాలంటే క్రింది కోర్టుకు వెళ్లాలని హై కోర్ట్ సూచించింది.

Leave a Reply

Your email address will not be published.