జగన్ నిర్ణయం సూపర్.. విజయసాయికి కీలక బాధ్యతలు

జగన్ నిర్ణయం సూపర్.. విజయసాయికి కీలక బాధ్యతలు

ఆర్.బి.ఎం అమరావతి: వైసీపీలో ఎంపీ విజయసాయి ప్రధాన్యత తగ్గుతోందని ఇటీవల కాలంలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. విజయసాయి స్థానాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భర్తీ చేశారని అందరూ అనుకున్నారు. అయితే ఇవన్నీ పుకార్లేనని తేలిపోయింది. విజయసాయికి పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అనుబంధ విభాగాల ఇంచార్జ్‌గా విజయసాయిరెడ్డి నియామిస్తూ ఆదేశాలిచ్చారు. పార్టీ అన్ని విభాగాల ఇంచార్జ్‌గా ఆయనను కీలక బాధ్యతలు అప్పగించారు. రేపటి నుంచి విజయసాయి బాధ్యతలు తీసుకుంటారని చెబుతున్నారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా మూడేళ్లు అవుతుంది. ఇప్పటివరకు పార్టీ నిర్మాణాలపై జగన్ దృష్టి పెట్టలేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నిర్మాణాలను పటిష్టం చేసేందుకు పూనుకున్నారు. కొన్ని నియోజకవర్గాలకు పార్టీ బాధ్యులకు, ప్రజాప్రతినిధుల మధ్య సంబంధాలు లేవు. కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను జగన్ స్వయంగా రంగంలోకి దిగి గాడిలో పెట్టారు. ఇంకా కొన్ని పాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. సమన్వయం లోపం వల్ల పార్టీకి ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోంది. ఈ సమస్యలన్నింటీని చక్కదిద్దేందుకు విజయసాయి కీలక బాధ్యతలు అప్పగించారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.