ఉత్తమ ఫలితాలును సాధించాలి…

ఉత్తమ ఫలితాలును సాధించాలి…

లక్కిరెడ్డిపల్లె మోడల్ స్కూల్ సందర్శనలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

ఆర్.బి.ఎం:  నాణ్యమైన విద్యను బోధించి ఉత్తమ ఫలితాలును సాదించాలని లక్కిరెడ్డిపల్లె మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులుకు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. శనివారం శ్రీకాంత్ రెడ్డి లక్కిరెడ్డిపల్లె మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలను సందర్శించారు. విద్యార్థుల తరగతి గదుల్లోకి వెళ్లి అందుతున్న విద్యాబోధనపై ఆరా తీశారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులుతో సమావేశమై పాఠశాల అభివృద్ధి, ఉత్తమ ఫలితాలు సాధనకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. పాలెం గొల్లపల్లె కు బస్ సౌకర్యం కల్పించాలని ఆ ప్రాంత విద్యార్థులు చీఫ్ విప్ ను కోరగా తక్షణమే బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్ టి సి డి ఎం కు సూచించారు. పాఠశాల వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో పోలీసుల గస్తీ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులుకు శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published.