పని చేయని కోవిన్ పోర్టల్.. గంటలోనే క్రాష్..

పని చేయని కోవిన్ పోర్టల్.. గంటలోనే క్రాష్..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కరోనాను నియంత్రించేందుకు చేసే బృహత్తర వాక్సిన్నేషన్లో భాగంగా 18 ఏళ్ళు పైబడిన పౌరులందరికీ వాక్సిన్ నమోదు ప్రక్రియ ఈ రోజు సాయంత్రం మొదలైంది. దేశ వ్యాప్తంగా అందరు ఒకేసారి కోవిన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ అయ్యే క్రమంలో ఆ సైట్ క్రాష్ అయింది. వాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం యువత ఎంతో ఆసక్తిగా ఉన్న ఈ సందర్భంలో ఒక్కసారిగా ఇలా జరిగే సరికి వారు కొంత అసహనానికి లోనయ్యారు. పోర్టల్ ను ప్రారంభించిన కొద్దీ సేపటికే ఈ సమస్య ఎదురైంది. తమ ఫోన్ లకు సర్వర్ ఎర్రర్ అనే మెసేజ్ లు వస్తున్నాయని యువత నెట్టింట్లో తెలిపారు. మరి కొంత మందికి ఓటీపీ సమస్య కూడా ఎదురైంది. ఈ నేపథ్యంలో యువత సామజిక మాధ్యమాల్లో వారి అసహనాని వ్యక్తపరుచుతూ పోస్ట్లు పెడుతున్నారు.ఆరోగ్య సేతు ఆప్ లో కూడా ఎర్రర్ సమస్య ఇదేవిధంగా వస్తున్నట్టు తెలుస్తోంది. కొంత మంది పౌరులకు ఈ సైట్ లో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ప్రస్తుతానికి సైట్ మళ్ళి అందరికి అందుబాటులోకి వాచినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.