సతీమణి కోసం రూటు మార్చిన జగన్

అమరావతి: సీఎం అంటే క్షణం తీరక ఉండదు. సమీక్షలు, సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు, ఇలా ప్రభుత్వం, పార్టీ పనుల్లో ఇలా నిత్యం ఏదో కార్యక్రమంలో మునిగి తేలుతుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రులు. ఓ నిమిషం కూడా వృధా కానివ్వకుండా ముఖ్యమంత్రి షెడ్యూల్‌ను అధికారులు ప్రిపేర్ చేస్తారు. అయితే ఇందుకు విరుద్ధంగా సీఎం జగన్ వ్యవహరించారు. ఓ సాదారణ భర్తలాగా ఆయన తన సతీమణీ భారతిని హైదరాబాద్ దింపి అక్కడి నుంచే పికప్ చేసుకుని తాడేపల్లి వచ్చారు. ఇందుకోసం ఏకంగా విమానాన్నే వాడుకున్నారు జగన్. తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి తిరుపతికి బయలుదేరారు. అయితే గన్నవరం ఎయిర్‌పోర్టులో జగన్ వెళ్తున్న విమానంలో భారతి ఎక్కారు. అయితే అందరూ ఏమనుకున్నారంటే.. సీఎం దంపతులిద్దరూ తిరుమలకు వెళ్తున్నారని అనుకున్నారు. కానీ తిరుమలలో సీఎం మాత్రమే దర్శనమిచ్చారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. భారతిని ఎక్కడ అని మీడియా ప్రతినిధులు ఆరా తీశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. గన్నవరం నుంచి రేణిగుంటకు వెళ్లాల్సిన విమానం నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడ భారతి ఫ్లైటు దిగి వెళ్లిపోయారు. అక్కడి నుంచి జగన్ తిరుమలకు ఒంటరిగా వెళ్లారు. తిరుమల కార్యక్రమం ముగించుకుని ఆయన కర్నూలు జిల్లాకు వెళ్లారు. కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయం నుంచి జగన్ విజయవాడకు రావాల్సి ఉంది. అయితే ఆయన భారతీని పికప్ చేసుకోవడానికి బేగంపేట విమానాశ్రయంకు వెళ్లారు. అక్కడ భారతి కోసం జగన్‌ అందులోనే 20 నిమిషాలపాటు ఎదురుచూశారు. ఆమె వచ్చిన తర్వాత సతీసమేతంగా నుంచి గన్నవరం బయలేదేరారు. అక్కడి నుంచి సీఎం దంపతులు రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.