అర్ధసెంచరీలతో దూకుడు..టీ20లో..టీమిండియా ఘనవిజయం

తిరువనంతపురం: గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. 106 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో ముగించింది. భారత్ బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, కోహ్లీ వెంటవెంటనే ఔటైనా..రాహుల్ 56 బంతుల్లో 51, సూర్యకుమార్ యాదవ్ 33 బంతుల్లో 50 అర్ధసెంచరీలతో కదం తొక్కడంతో అలవోక 106 పరుగుల లక్ష్యాన్ని చేధించారు. దీంతో మూడు టీ20ల సిరీస్ లో భారత్ 1-0గా ముందజలో ఉంది.

అంతకుముం టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 106 పరుగులు చేసింది. భారత్ బౌల్లర్ల ధాటికి సౌతాఫ్రికాటీమ్ పేవిలియన్ క్యూకట్టారు. దీంతో 9 పరుగులకే సౌతాఫ్రికా 5 కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో కురుకుపోయింది. అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, దీపక్ చహర్ 2 వికెట్లతో దక్షిణాఫ్రికాను దెబ్బతీశారు. తొలి ఓవర్ లోనే కెప్టెన్ టెంబా బవువాను చాహర్ ఔట్ చేసి శ్రీకారం చుట్టాడు. తర్వాత ఓవర్ వేసిన అర్షదీప్ కూడా రెచ్చిపోయి మూడు వికెట్లు తీసి సఫారిల నడ్డివిడిచారు. అయితే పర్యాటక జట్టు గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయడంలో మార్‌క్రమ్ (25), పార్నెల్ (24), కేశవ్ మహారాజ్ (41) కీలకపాత్ర పోషించాడు.

Leave a Reply

Your email address will not be published.