సీబీఐ కోర్టులో జగన్‌కు బిగ్ రిలీఫ్
ఆర్.బి.ఎం హైదరాబాద్: సీబీఐ కోర్టులో సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికు ఊరట లభించింది. జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. రఘురామ దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులోనే సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. అయితే నేడు సీబీఐ కోర్టు రఘురామ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.
మరోవైపు జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు పిటిషన్‌ను వేరే బెంచ్‌కు మార్చాలని రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టును కోరారు. రఘురామ వేసిన పిటిషన్‌పై హైకోర్టు కూడా ఈ రోజే వాదనలు వినింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. రఘురామ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేకాదు జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి కోర్టు నిరాకరించింది. అటు హైకోర్టు, ఇటు సీబీఐ కోర్టులో జగన్‌ను అనుకూలంగా తీర్పులు రావడంతో వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.