ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై కేటీఆర్ ట్విట్… కేటీఆర్‌పై నెటిజన్ల ఫైర్‌

ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై కేటీఆర్ ట్విట్… కేటీఆర్‌పై నెటిజన్ల ఫైర్‌

ఆర్.బి.ఎం హైదరాబాద్: సోషల్ మీడియాతో మంత్రి కేటీఆర్ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ట్విట్టర్‌లో ప్రజలు తమ సమస్యలను వ్యక్తం చేసినప్పుడు ఆయన వెంటనే స్పందిస్తూ ఉంటారు. కొన్ని సార్లు సమస్యలను పరిష్కరించి.. ప్రసంశలు కూడా అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పటిలాగే సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన నిందితుడిని గంటల వ్యవధిలోనే పట్టుకుంటామని ఈ నెల 12నే మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఘటన జరిగిన ఏడు రోజులు గడుస్తున్న నిందితుడి ఆనవాళ్లు కూడా పోలీసులు కనుక్కోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ‘‘నిందితుడు ఎక్కడ మంత్రిగారూ? అతడిని ఎప్పుడు అరెస్ట్‌ చేశారు?’’అంటూ నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించిన కేటీఆర్‌కు మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా కేటీఆర్‌ను తప్పుబడుతున్నారు. ఈ విమర్శలపై మంగళవారం మరోసారి కేటీఆర్ ట్విటర్‌ వేదికగా స్పందించారు. నిందితుడి అరెస్టుపై తనకు తప్పుడు సమాచారం వచ్చిందని, దాని ఆధారంగా ట్వీట్‌ చేశానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.