ఏపీ కేబినెట్‌లో విస్తరణలో ఆ నేతకు అగ్రతాంబూళం!

jagan

ఏపీ కేబినెట్‌లో విస్తరణలో ఆ నేతకు అగ్రతాంబూళం!

ఆర్.బి.ఎం అమరావతి: ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేముందు అసంతృప్తి నేతలను శాంతిపజేసేందుకు ఓ హామీ ఇచ్చారు. అదేందంటే రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రి వ‌ర్గంలో మార్ప‌ులు చేస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అందరికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని నెలకొల్పి దాదాపుగా రెండున్నరేళ్లు కావోస్తోంది. దీంతో ఆశావాహులు మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆశావాహుల ఆశలను జగన్ ఏమాత్రం నెరవేర్చుతారో తెలియదు కానీ  ఆయనను మాత్రం జగన్ త్వరలోనే మంత్రి చేయబోతున్నారనే ప్రచారం వైసీపీ వర్గాల్లో సాగుతోంది. జగన్‌కు ఆయన అత్యంత విధేయుడు  మీకు ఇంకో విషయం చెప్పాలి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు పోటీ పడలేదు. ఆయనకున్న వాక్‌చ్ఛాతుర్యం వల్ల వైసీపీలోని సీనియర్లను పక్కుకు తోచి మరీ అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. అంతేకాదండోయ్ ఆయన జగన్‌కు తోడినీడగా ఉన్నారు కూడా. ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఇదే విపక్షాలకు నచ్చడం లేదు. ఏ హోదాలో తమను ప్రశ్నిస్తున్నారని సదరు నేతను విపక్షాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్షాల నోళ్లు మూయించేందుకు ఆయనకు జగన్ తన మంత్రి వర్గంలోకి ఆహ్వానిస్తున్నారంట. ఆయన ఎవరో మీకు ఇప్పుడే అర్థమయివుంటుంది.

Leave a Reply

Your email address will not be published.