సంక్షేమ పథకాల రారాజు సీఎం జగన్…

సంక్షేమ పథకాల రారాజు సీఎం జగన్…

ఆర్.బి.ఎం: జనరంజకంగా జగన్ మూడేళ్ళ పాలన సాగిందని వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. జగన్ పాలన మూడేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, జెడ్ పి టిసి వెంకటేశ్వర రెడ్డి లతో కలసి శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు, కార్యకర్తలుతో కలసి భారీ కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మాట తప్పని, మడమ తిప్పని నేతగా, అన్ని వర్గాల వారికి చేరువై, ప్రజల ఆరాధ్యనాయకుడిగా సీఎం జగన్ పేరొందుతున్నారన్నారు.రాష్ట్ర ఆర్ధిక ఇబ్బందులు వున్నా ఇచ్చిన హామీలను మూడేళ్ళ పాలనా కాలంలో తొంభై ఐదు శాతం కుపైగా హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు.యావత్ దేశం రాష్ట్రం వైపు చూసేలా, రాష్ట్రంలో అమలవుచున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు అనుసరించేలా ఆదర్శంగా పాలన సాగిస్తున్నారన్నారు.సంక్షేమ పథకాల అమలులో సీఎం జగన్ రారాజుగా వెలుగొందుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలును అందిస్తున్నారన్నారు. పేదలు, బడుగు, బలహీన ,మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేస్తూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన సాగుతోందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో అఖిలభారత వెనుకబడిన వర్గాల ఫోరం కన్వీనర్ వండాడి వెంకటేశ్వర్లు,బిసి నాయకుడు వీరాంజనేయ ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్,డిసిసిబి డైరెక్టర్ సేఠ్ వెంకట్రామి రెడ్డి, సింగల్ విండో అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, ఆసీఫ్ అలీఖాన్, ఫయాజ్ అహమ్మద్, కసిరెడ్డి వెంకటనరసింహారెడ్డి, అన్నా సలీం,గౌస్ ఖాన్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, సుగవాసి శ్యామ్, జానం రవీంద్ర యాదవ్, బీసీసెల్ విజయభాస్కర్, నిస్సార్, అల్తాఫ్, జయన్న నాయక్, భాస్కర్,గువ్వల బుజ్జిబాబు, కొత్తపల్లె ఇంతియాజ్, గన్నామంతి బాలాజీ కుమార్, విక్కీ దేవేంద్ర, కో ఆప్షన్లు ఆసీఫ్ అలీఖాన్,ఖాదర్ వలీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.