జగన్ పాలనలో సామాజిక విప్లవం…

జగన్ పాలనలో సామాజిక విప్లవం…

ఆర్.బి.ఎం: సోమవారం రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో సామాజిక న్యాయ భేరి వైఎస్ఆర్ సిపి బస్సు యాత్ర పోస్టర్లను బిసి నాయకులతో కలసి వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూదేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని అమలు చేస్తోందన్నారు.

రాష్ట్రంలో అమలవుతున్న సామాజిక న్యాయాన్ని చాటిచెప్పేలా సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ఈనెల 26నుంచి 29వరకు జరగనుందన్నారు.రాష్ట్ర ప్రజలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారన్నారు.ఎస్ సి, ఎస్ టి బి సి  మైనారిటీ లను చంద్రబాబు నాయుడు ఓటు బ్యాంక్ గా మాత్రమే వాడుకుని, రాజకీయంగా ఆర్థికంగా ఎదగనివ్వకుండా చేశారన్నారు.ఐదేళ్ల కాలంలో ఎస్ సి , ఎస్ టి, బిసి, మైనారిటీ వర్గాలుకు చెందిన వారిని రాజ్యసభకు చంద్రబాబు నాయుడు పంపలేదని, ప్రస్తుతం రాజ్యసభలో 8 స్థానాలు ఖాళీ అయితే 4 స్థానాలును బిసిలకే రాజ్యసభ స్థానాలను జగన్ ఇచ్చారన్నారు.ప్రస్తుత రాష్ట్ర క్యాబినెట్ లో కూడా 40 శాతం పదవులును బిసి లకు ఇచ్చి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారన్నారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అన్ని ప్రాంతాలలో ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారన్నారు.అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతుండడంపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారు.ఎన్నికలలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ పాలనలో తొంభై ఐదు శాతానికి పైగా హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పని మరి కొన్ని పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు .ప్రతి ఒక్కరూ సామాజిక న్యాయభేరి వైఎస్ఆర్ సిపి బస్సు యాత్రను విజయవంతం చేయాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో జెడ్ పి టిసి మాసన వెంకటరమణ, మండల బిసి నాయకుడు పల్లపు రమేష్, బిసి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్, కురబ కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, నియోజకవర్గ బిసి సెల్ కన్వీనర్ నాగరాజుయాదవ్,శివ శంకర్ యాదవ్, రెడ్డివరప్రసాద్,మాజీ ఎంపీటిసి శివయ్య, గువ్వల బుజ్జిబాబు, పల్లపు రామాంజనేయులు,ప్రసాద్,ప్రతాప్,మోడెం రమేష్, ఉప సర్పంచ్ శివయ్య,రెడ్డెప్ప, జయదేవ, భాస్కర్, శ్రీను, హరినాధ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.