క్రీడా పరికరాల పంపిణీ కార్యక్రమం..

ఆర్.బి.ఎం : ఔత్సహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నిధుల కొరత ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ లోని తన క్యాంపు కార్యాలయంలో జీ హెచ్ ఎం సీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరిధిలోని వివిధ డివిజన్లకు క్రీడా పరికరాల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సితాఫలమండీ, బౌద్దనగర్ డివిజనలకు సంభందించిన కార్పొరేటర్లు, వివిధ క్రీడా సంఘాలకు క్రీడా పరికరాలను ఈ సందర్భంగా అందచేశారు. ఈ కార్యక్రమంలో తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ క్రీడా మైదానాలను తీర్చి దిద్దాలని, జిమ్ లను సద్వినియోగం చేసుకొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. వివిధ ప్రదేశాల్లో ఓపెన్ జిమ్ లను నెలకొల్పడంతో పాటు ఆయా సంఘాలను ప్రోత్సహించేందుకు జిమ్ సామగ్రిని అందించాలని తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు. కార్పొరేటర్లు శ్రీమతి రాసురి సునిత, శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, శ్రీమతి కంది శైలజ, అధికారులు శ్రీనివాస్ గౌడ్, కుమార్, యువ నేత, రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *