సాక్షి మీడియాపై షర్మిల ఫైర్..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని వారికి న్యాయం చేయడానికి నేను నడుం బిగిస్తా అంటూ మొన్న ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. నిరుద్యోగుల కోసం దీక్ష చేపడతానని కెసిఆర్ మూసుకున్న కళ్ళను తెరిపిస్తామని ఆమె అన్నారు. అయితే ఈ రోజు ఇందిరాపార్క్ వేదికగా షర్మిల దీక్షకు కూర్చుంది. ఆమె తలపెట్టిన ఈ దీక్షకు పలు కుల సంఘాలు మద్దతు తెలిపాయి. ఉదయం నుండి మొదలైయన ఈమె దీక్షకు అభిమానులు నాయకులూ భారీ మొత్తంలో అక్కడికి చేరుకున్నారు. షర్మిల తలపెట్టిన దీక్షను కవరేజ్ చేయడానికి పలు మీడియా ఛానల్ లు వచ్చి అక్కడి కార్యక్రమాలను కవర్ చేసుకున్నాయి. ఈ క్రమంలో సాక్షి ఛానల్ కు సంబంధించిన కెమరామెన్ కొద్దిగా షర్మిలకు కోపం తెప్పియడం తో ఆమె ఆ కెమరామెన్ కు అందరూ చూస్తుండగానే మీ సాక్షి ఛానల్ కవరేజ్ నాకు అవసరం లేదు ఎట్లాగో మీరు నా వార్తలు వేయరు మీరు ఇక్కడి నుండు వెళ్లిపోవచ్చు అని ఆ కెమరామెన్ కు గట్టిగా చెప్పగా షర్మిల పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ విజయమ్మ షర్మిలను తట్టుతూ ఆలా అనవద్దు అంటూ సైగలు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చాల వైరల్ గా మారింది.