గవర్నర్ కోటాలో కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ లేనట్టేనా?
ఆర్.బి.ఎం హైదరాబాద్: టీఆర్ఎస్ నేత కౌశిక్‌రెడ్డికి గవర్నర్ తమిళిసై షాకిచ్చారు. కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీకి సిఫార్సు చేయడంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక సేవకులకు, ఇతర రంగాల్లో విశేష కృషి చేసినవారినే ఎమ్మెల్సీకి నామినేట్ చేయడం సరైందని అభిప్రాయపడ్డారు. కౌశిక్‌రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. గవర్నర్ అభిప్రాయంతో ఒక్కసారి టీఆర్‌ఎస్‌లో కలకలం రేగింది. గవర్నర్ కోటాలో కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ లేనట్టేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో సీఎం కేసీఆర్ చేర్చుకున్నారు. అందుకు ప్రతిఫలంగా ఆగస్టు ఒకటవ తేదీన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ నామినేటెడ్ కోటాలో కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కౌషిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు ఫైల్ కూడా పంపించారు. అయితే గవర్నర్ తమిళి సై ఆ ఫైల్‌ను పరిశీలనలో పెట్టారు. తాజాగా ఆ ఫైల్ గురించి గవర్నర్ తమిళి సై మౌనం వీడారు.
One Comment on “గవర్నర్ కోటాలో కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ లేనట్టేనా?”