రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ భారీ ప్యాకేజీ ఇచ్చారు: పాడి కౌశిక్ రెడ్డి

రేవంత్ రెడ్డి కి ఈటల రాజేందర్ భారీ ప్యాకేజీ ఇచ్చారు: పాడి కౌశిక్ రెడ్డి

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు ఓటమి భయం పట్టుకుందని అందువల్లే అయన ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు.తెరాస పార్టీలో ఉండి భూకబ్జాలు , అక్రమాలకు పాల్పడి తన ఆస్తులను కాపాడుకోవడాని కోసం తెరాస కు ఈటల రాజీనామా చేసి ఇప్పుడు ఆత్మగౌరవం అని అంటున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ భారీ ప్యాకేజీ ఇచ్చారని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఈటల కుమ్మక్కయ్యారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి కి ఇచ్చిన భారీ ప్యాకేజీ పై చర్చకు ఈటల రాజేందర్ ను ఇల్లందుకుంటలోని రాముల వారి గుడికి రావడానికి సిద్ధమా అంటూ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈటల రాజేందర్ తన నియోజకవర్గంలో కనీసం ఒక్కరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయించారా ? మంజూరు చేయించామని అయన నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు.

Leave a Reply

Your email address will not be published.