నిందితుడిని కఠినంగా శిక్షించాలి: సీతక్క ఎమ్మెల్యే

నిందితుడిని కఠినంగా శిక్షించాలి: సీతక్క ఎమ్మెల్యే

ఆర్.బి.ఎం హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సైదాబాద్‌లో ఆరేళ్ల గిరిజన బాలిక హత్యాచార ఘటనపై ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. సీతక్క మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నగరం నడిబొడ్డున చిన్నారిపై హత్యాచారం జరిగినా.. ప్రభుత్వం స్పందించలేదని సీతక్క ధ్వజమెత్తారు. గిరిజన బిడ్డలకు అన్యాయం జరిగితే గిరిజన ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదని సీతక్క తప్పుబట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఇలాంటి దారుణ ఘటనలు మళ్ళి జరగకుండా చట్టాలను ఏర్పాటు చేయాలనీ సీతక్క డిమాండ్ చేశారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో గంజాయి మత్తులో ఉన్న రాజు అనే దుర్మార్గుడు తన గుడిసె సమీపంలో ఆడుకుంటున్న ఆరేళ్ల గిరిజన చిన్నారికి స్వీటు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి.. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.

Leave a Reply

Your email address will not be published.