క్యాసారం గ్రామ తెరాస అధ్యక్షుడిగా ఆలూరి రాజేశ్వర్ గౌడ్..
ఆర్.బి.ఎం పటాన్ చేరు, క్యాసారం: పటాన్ చేరు నియోజకవర్గంలోని క్యాసారం గ్రామంలో గ్రామ టీఆరెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలు క్యాసారం గ్రామ ఉప్ప సర్పంచ్ విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో తెరాస గ్రామ అధ్యక్షుడిగా ఆలూరి రాజేశ్వర్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ ఉపాధ్యక్షులుగా ఎండి.పాషా, ప్రధాన కార్యదర్శిగా రామరాజు, సలహాదారులు బి.ప్రభాకర్, శరణప్ప, ఎం.యాదయ్య, యూ.సత్యనారాయణ గౌడ్, యాదవ రెడ్డి, డి.నర్సింలు, మల్లారెడ్డి లును నియమించారు.
క్యాసారం గ్రామ నూతన తెరాస అధ్యక్షుడు ఆలూరి రాజేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ..
తనను నమ్మి ఏకగ్రీవంగా గ్రామ తెరాస అధ్యక్షుడిగా ఎన్నుకునందుకు నాయకులకు కార్యకర్తలకు రాజేశ్వర్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు.కార్యకర్తలకు ప్రతి నిమిషం అందుబాటులో ఉంటానని గ్రామ అభివృద్దే ద్యేయంగా పని చేస్తానని రాజేశ్వర్ గౌడ్ తెలిపారు.తెరాస ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతుందని అయన అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలకు అందేలా చూస్తానని రాజేశ్వర్ గౌడ్ అన్నారు.
గ్రామ ఉప్ప సర్పంచ్ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ తెరాస నూతన అధ్యక్షుడు ఆలూరు రాజేశ్వర్ గౌడ్ కు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి పక్షాలు తెరాస ప్రభుత్వం పై ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు నమ్మరని తెరాస వైపే ప్రజలు చూస్తున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికలో మరోసారి తెరాస పార్టీ అధికారంలోకి వస్తుందని విక్రమ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రాజేందర్, బి.రమేష్ బాబు, వార్దు మెంబర్ ఈశ్వర్ యాదవ్,ఎం.దశరథ్, సంజీవ, శ్రీనివాస్ యాదవ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.