అల్లు అర్జున్ ను అభినందించిన బి.జనార్దన్ రెడ్డి
ఆర్.బి.ఎం: తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డు రావడం పట్ల బిజెపి సీనియర్ నేత బి. జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, జనార్ధన్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. 69 ఏళ్లలో మొదటిసారి తెలుగు హీరోకు ఉత్తమ నటుడు అవార్డు దక్కడం గొప్ప విషయం అని జనార్దన్ రెడ్డి కొనియాడారు. అల్లు అర్జున్ కు తొలిసారిగా బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. మూడు రోజుల క్రితం జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో తెలుగు సినిమాకు 11 అవార్డులు దక్కాయి.