అత్త, కోడళ్ళు ఆషాఢమాసంలో ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదు.. దాని రహస్యం ఇదే..

అత్త, కోడళ్ళు ఆషాఢమాసంలో ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదు.. దాని రహస్యం ఇదే..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరబాద్: ఆషాఢమాసం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కొత్తగా వివాహమైన భార్య భర్తలు దూరంగా ఉండాలని సూచిస్తారు. ఆషాఢమాసం శుభకార్యాలకు అనుకూలం కాదని శాస్త్రం చెబుతోందని వేదపండితులు పేర్కొంటున్నారు. ఆషాఢమాసం బార్యాభర్తలే కాకుండా అత్తా కోడళ్లు కూడా ఒకే ఇంట్లో ఉండకూడదనే ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయం. ఈ సాంప్రదాయం పాటించడం వెనుక అసలైన కారణం కూడా ఉంది. సాదారణంగా ఎక్కువ వివాహాలు మాఘ, వైశాఖమాసంలో జరుగుతుంటాయి . వైశాఖమాసం అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భగ భగ మండే వేసవికి అనుకూలమైన మాసం. ఈ మండే వేసవికి నూతనంగా వచ్చిన పెళ్లికూతురుకు అసౌకర్య భావన కలగడంతో అత్తా కోడల మధ్య సఖ్యత లేకుండా పోతుందని పలువురు పండితులు చెబుతున్న మాట. అందువల్లనే నూతనంగా  పెళ్ళైన మహిళలను ఆషాఢ మాసంలో తమ పుట్టింటికి పంపిస్తారని అంటుంటారు. అయితే ఇదే ఆషాఢ మాసంలో అత్తా కోడలు ఒకే ఇంట్లో ఉండకపోవడానికి అసలైన కారణమని కొంతమంది చెబుతుంటారు.

కొంత మంది ఇలా కూడా అంటారు..

మరి కొంత మంది ఈ విషయంలో మరో విధంగా అంటుంటారు . ఆషాఢ మాసం అనేది తొలకరి చినుకులతో రైతులు పంటలు వేయడానికి అనుకూలంగా ఉండే మాసం. రైతు కష్టపడితే గానీ దేశానికి తిండి దొరకని పరిస్థితి అని అందరికి తెలిసిన విషయమే. ఈ ఆషాఢ మాసంలో నూతనంగా వివాహమైన వరుడు తన భార్య మీద వ్యామోహంతో వ్యవసాయ పనులను దూరం పెడతాడు. అందువల్లనే భార్య ను పుట్టింటికి పంపిస్తారని మరో విధంగా పలువురు చెబుతుంటారు.

భార్యాభర్తలు ఆషాఢ మాసంలో ఒకే ఇంట్లో ఉండటం వల్ల..

ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉండటంతో స్త్రీ గర్భం దాలిస్తే 9నెలల తర్వాత వేసవి కాలంలో బిడ్దకు జన్మనించే అవకాశం ఉంటుంది. వేసవి సమయంలో ఉష్ణోగ్రతలు చాల ఎక్కువగా ఉండి బిడ్దకు ఆ వాతావరణం కొంత మేరకు ఇబ్బంది కల్గిస్తుంది. దీంతో ఆ బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. తల్లీబిడ్డలకు ఈ వాతావరణం అంత మంచిది కాదనే భావన ఉంది.  ఈ క్రమంలోనే ఆషాఢ మాసాన్ని శూన్య మాసంగా భావిస్తుంటారు. శుభ కార్యాలు చేయకూడదని వేద పండితులు సూచిస్తారు.

Leave a Reply

Your email address will not be published.