జగన్ మనసు నొచ్చుకుంటుందని.. అసదుద్దీన్, వైఎస్‌ఆర్ వర్థంతి సభకు వెళ్లడం లేదట!

జగన్ మనసు నొచ్చుకుంటుందని.. అసదుద్దీన్, వైఎస్‌ఆర్ వర్థంతి సభకు వెళ్లడం లేదట!

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పుష్కరకాల వర్థంతి సభకు రావాలని, ఆయన సతీమణీ విజయమ్మ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 300 మందికి ఆహ్వానాలు పంపారు. ఈ ఆహ్వానాలు అందుకున్న వారిలో వైసీపీ మంత్రులు, శాసనసభసభ్యులు ఉన్నారు. అయితే ఇక్కడే చిక్కువచ్చి పడింది. వైఎస్‌ఆర్‌తో ఉన్న అనుబంధంతో సభకు వెళ్లాలా? వెళ్తే తర్వాత ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందేమోనని వైసీపీ నేతలు గందరగోళంలో పడ్డారు. విజయమ్మ ఆహ్వానాలు పంపిన వారిలో ఎంపీ అసదుద్దీన్ కూడా ఉన్నారు. అయితే ఆయన విజయలక్ష్మి పంపిన ఆహ్వానాన్ని స్వాగతిస్తూనే.. తాను సభకు రాలేనని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకు అసదుద్దీన్ ఓ వివరణ కూడా ఇచ్చారు. వైఎస్‌ఆర్ అంటే తనకు అభిమానం ఉందని, అయినప్పటికీ తాను సభకు రాలేదని తన సందేశాన్ని విజయమ్మ పంపారు. అసదుద్దీన్‌కు వైఎస్ కుటుంబానికి చాలా అనుబంధం కూడా ఉంది. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఎంఐఎంతో మద్దతుతో కాంగ్రెస్, జీహెచ్‌ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకుంది. రాజశేఖర్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని అసదుద్దీన్, సీఎం జగన్‌తో కూడా కొనసాగించారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తానని ప్రకటించారు కూడా. కానీ ఆయన ఏపీలో ప్రచారానికి వెళ్లలేదు. అయితే జగన్‌కు ఇచ్చిన మాట కోసం ఆ ఎన్నికల్లో ఎంఐఎం ఏపీలో పోటీ చేయలేదని పలువురు చెబుతున్నారు.

రాజశేఖర్‌రెడ్డి, జగన్‌తో అనుబంధం ఉన్న అసదుద్దీన్, విజయమ్మ ఆహ్వాన్ని ఎందుకు తిరస్కరించారనే సందేహం సమాన్యుల్లో కల్గుతోంది. ఎందుకంటే ఈ సభకు రావాలని 2004, 2008 వైఎస్‌ఆర్ కేబినేట్‌లో ప‌నిచేసిన ఉభ‌య రాష్ట్రాల మంత్రుల‌కు విజ‌య‌మ్మ ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే జగన్ ఆహ్వానించలేదనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జగన్, వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల మధ్య విభేదాలు తారా స్థాయికి వెళ్లాయని చెబుతున్నారు. అందుకే ఆమె వేరు కుంపటి కూడా పెట్టారని చెబుతున్నారు. ఇలాంటి సందర్భంగా వర్థంతి సభకు వెళ్లే జగన్‌ మనసు నొచ్చుకుంటుందేమోనని, అసదుద్దీన్ సభకు వెళ్లడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

వైఎస్‌ఆర్ వర్థంతిని ప్రతి సంవత్సరం ఇడుపులపాయలో నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం హైదరాబాద్‌లో నిర్వహించాలని విజయమ్మ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లో సభను ఏర్పాటుపై కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలని షర్మిల అనుకుంటోంది. రాష్ట్రంలో పార్టీని పెట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో పార్టీ పురోగతి సాధించడం లేదనే వాదన ఒకటి వినిపిస్తోంది. షర్మిల పార్టీ నిర్మాణంపై కార్యాచరణపై తదనంతరకాలంలో వర్థంతి సభకు వచ్చిన పెద్దల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే వైఎస్‌ఆర్ వర్థంతి సభకు రావాలని విజయమ్మ 300 మందికి ఆహ్వానం పంపారు. 30 మాత్రమే సభావేదిక నుంచి ప్రసంగిస్తారు. అయితే ప్రజా గాయకుడు గద్దర్‌ను విజయమ్మ ప్రత్యేకంగా ఆహ్వానించారు. సినీ రంగం నుంచి చిరంజీవి, నాగార్జున, కృష్ణ, నిర్మాత దిల్‌రాజును ఆహ్వానించారు. టీఆర్ఎస్ నుంచి మంత్రి స‌బిత‌ ఇంద్రారెడ్డి, ఎంపీ డి. శ్రీనివాస్, మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్సన్ సునితా ల‌క్ష్మారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌ల‌ను ఆహ్వానించారు. ఇక కాంగ్రెస్ నుంచి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్, జానారెడ్డి, దామోద‌ర రాజ‌న‌రసింహ‌, గీతారెడ్డి, దుద్దిళ్ల శ్రీద‌ర్ బాబు ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ జితేందర్, డీకే అరుణ‌ల‌కు ఆహ్వానం పంపారు.

Leave a Reply

Your email address will not be published.