కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ప్రజా ప్రతినిధులపై కాల్పులు

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ప్రజా ప్రతినిధులపై కాల్పులు

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు పాల్పడ్డారు. ప్రతిసారి భారత ఆర్మీ లక్షంగా కాల్పులు జరిపే ఉగ్రవాదులు. ఈసారి రూటు మర్చి ప్రజాప్రతినిధులపై దాడులకు ఎగబడ్డారు. ప్రజా ప్రతినిధులు సోపోర్‌లో నిర్వహిస్తోన్న సమావేశంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగారు.

ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డ ఈ దాడిలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ రియాజ్‌, గన్‌మన్‌ అహ్మద్‌ చనిపోయారు . వీరిద్దరితో పాటు మరో కౌన్సిలర్‌ షమ్‌షుద్దీన్‌ పీర్‌కు తీవ్రంగా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదులు కౌన్సిలర్‌ల సమావేశంలో కాల్పులకు పాల్పడ్డారు . ఈ ఘాతుకానికి సంబంధించి ఎంత మంది ఉగ్రవాదులు కాల్పుల్లో పాల్గొన్నారు? ఇంకా ఎంత మందికి గాయాలు అయ్యాయి అనే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published.