వివాహం కోసం ఎన్నికలు..గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దేశం

హ‌వానా: క్యూబాలో కొత్త ఫ్యామిలీ చ‌ట్టానికి ఆమోద‌ముద్ర ప‌డింది. స్వలింగ సంపర్క వివాహాలకు క్యూబా దేశం చట్టబద్ధత కల్పించింది. ఇప్పటికే మహిళలకు పెద్దపీట వేస్తున్న ఈ దేశం ‘సేమ్ జెండర్’ మ్యారేజెస్ ను అధికారం చేసింది. స్వ‌లింగ సంప‌ర్కులు వివాహం చేసుకునే వీలును క‌ల్పిస్తూ కొత్త చ‌ట్టాన్ని రూపొందించారు. పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకునే అవ‌కాశాన్ని ఆ జంట‌ల‌కు క‌ల్పించారు. రెఫ‌రెండం నిర్వ‌హించి ఆ చ‌ట్టానికి ఓకే చెప్పేశారు. ప్ర‌జాభిప్రాయాన్ని 66.9 శాతం ఓట్ల‌తో ఆమోద‌ముద్ర వేసిన‌ట్లు జాతీయ ఎన్నిక‌ల మండ‌లి తెలిపింది. కొన్ని క్రైస్త‌వ సంఘాలు ఈ రెఫ‌రెండ‌మ్‌ను వ్య‌తిరేకించినా.. చివ‌ర‌కు స్వ‌లింగ సంప‌ర్కుల‌కు అనుకూల తీర్పు వ‌చ్చింది.

దీనిపై స్పందించిన క్యూబా అధ్యక్షుడు డయాజ్ క్యానెల్ ఎట్టకేలకు న్యాయం జరిగిందని ట్వీట్ చేశాడు. కొన్ని తరాల రుణం తీర్చుకున్నట్లయిందని తెలిపారు. కొన్ని వేల కుటుంబాలు ఈ చట్టం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. వీరు పిల్లలను దత్తత తీసుకోవచ్చని.. పురుషులు, మహిళలకు సమాన హక్కులుంటాయన్నారు.

Leave a Reply

Your email address will not be published.