పల్లె పల్లెనూ కలుపుతూ రహదారులును నిర్మించడమే లక్ష్యం…
ఆర్.బి.ఎం: నియోజక వర్గంలో పల్లె పల్లెనూ కలుపుతూ రహదారులును నిర్మించడమే లక్ష్యమని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.మంగళవారం చిన్నమండెం మండలంలో రూ 1.16 కోట్ల ఏ ఐ ఐ బి నిధులుతో పూర్తయిన కలిబండ రహదారి – నడిగడ్డపల్లె సిసి రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి తో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గంలో అన్ని ప్రాంతాలకు సరైన రహదారి సౌకర్యాలను కల్పించడం జరుగుతోందన్నారు.జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి మాట్లాడుతూ నడిగడ్డపల్లె నుండి కూతలవాండ్ల పల్లె వరకు, రామనాధపురం నుండి కమ్మపల్లె వరకు రహదారుల నిర్మాణాలుకు త్వరలో టెండర్లు పూర్తవుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో సింగల్ విండో అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి,వైఎస్ఆర్ సిపి నాయకులు రమణా రెడ్డి, నాగశేషా రెడ్డి, ఎంపిటిసి గంగులయ్య, డి వి ఎం సి సభ్యుడు చుక్కా అంజనప్ప తిరుపతి నాయుడు, డిఈఈ గోపాల్ రెడ్డి, ఏఈఈ సందీప్ తదితరులు పాల్గొన్నారు.