అజిత్ అభిమానుల సేవలు అమోగం..
ఆర్.బి.ఎం డెస్క్: కరోనా సెకండ్ వేవ్ తమిళనాడులో తీవ్రంగా వ్యాపిస్తుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో నిరుపేదలు పనులు లేక తీవ్రమైన అవస్థలు పడుతున్నారు.ఈ క్రమంలో అనాథలు, బిచ్చగాళ్ల ఆకలి తీర్చడానికి తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుల అభిమానులు ముందుకు వచ్చారు.హీరో అజిత్ ఫాన్స్ పుదుచ్చేరిలో వినూత్నంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తోపుడు బండ్లలో ఆహార పొట్లాలు, అరటిపండ్లు, వాటర్ బాటిళ్లు,బిస్కెట్ల ప్యాకెట్‌లతో కూడిన తోపుడు బండ్లను రహదారులపక్కన ఏర్పాటు చేశారు. ఆకలితో ఉన్నవారు తోపుడు బండ్ల వద్దకు వచ్చి ఆహారాన్ని తీసుకోవచ్చు అన్న పోస్టర్లు వాటిపై అంటించారు. ఇలాంటి విపత్కర సమయంలో అజిత్ అభిమానులు చేస్తున్న సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.