నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి రూ 16 కోట్ల నిధులు మంజూరు..

నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి రూ 16 కోట్ల నిధులు మంజూరు..

ఆర్.బి.ఎం రాయచోటి: రాయచోటి ఠాణా సర్కిల్ నుంచి సుండుపల్లె రహదారి మార్గంలో సుండుపల్లె – వీరబల్లె క్రాస్ రోడ్డువరకు సెంట్రల్ లైటింగ్ తో కూడిన నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి రూ 16 కోట్లనిధులు మంజూరు జి ఓ విడుదలపై అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎంఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అధిక వర్షాల సమయంలో సద్దికూళ్ళ వంక దగ్గర రోడ్డు దాటాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈ పనులలో భాగంగానే సద్దికూళ్ళ వంక బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుందన్నారు.పట్టణంలోని గుణ్ణికుంట్ల రహదారి సుందరీకరణ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయన్నారు.

ఈ రహదారి పూర్తిచేసుకోవడంతో పాటు కంసల వీధి, మెయిన్ బజార్ రోడ్డు కూడా అభివృద్ధి చేసుకుంటే పట్టణ రూపురేఖలు మారతాయన్నారు.రాష్ట్ర ఆర్ధిక ఇబ్బందులున్నా సీఎం జగన్ రాయచోటి ప్రాంతంపై ఉన్న అభిమానంతో నిధులు మంజూరు చేస్తుండడం సంతోషదగ్గ విషయమన్నారు.సీఎం జగన్, ఎంపి మిథున్ రెడ్డి, సీఎం అదనపు కార్యదర్శి ధనంజయ రెడ్డి లకు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాయచోటి చరిత్రలోనే ఈ విధంగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం జగన్ కే సాధ్యమైందన్నారు.రింగ్ రోడ్డుకు సంబంధించిన రెండు ప్యాచ్ ల విషయం కోర్టు పరిధిలో ఉన్నాయన్నారు.ఆ పెండింగ్ పనులకు రూ 6 కోట్ల నిధులను మంజూరు చేయనున్నారని తెలిపారు. ఈ పనులకు కూడా కోర్ట్ అంశాలను పరిగణనలోకి తీసుకుని రూ 6 కోట్ల నిధులుతో రింగ్ రోడ్ పెండింగ్ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published.