రాష్ట్రాభివృద్ధికి పొట్టిశ్రీరాములు వంటి త్యాగధనుల స్పూర్తితో అంకిత భావంతో నిబద్ధతతో ముందుకెళదాం: శ్రీకాంత్ రెడ్డి

రాష్ట్రాభివృద్ధికి పొట్టిశ్రీరాములు వంటి త్యాగధనుల స్పూర్తితో అంకిత భావంతో నిబద్ధతతో ముందుకెళదాం: శ్రీకాంత్ రెడ్డి

  • రాయచోటిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం రాయచోటి : ఆంధ్రరాష్ట్రం కోసం త్యాగాలు చేసిన పొట్టిశ్రీరాములు వంటి ఎందరో త్యాగధనులును స్మరించుకుంటూ రాష్ట్రాభివృద్ధికి అంకిత భావంతో, నిబద్ధతతో ముందుకెళదామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాయచోటి లో ఘనంగా నిర్వహించిన ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణం లోని బస్ స్టాండ్ మార్గంలో ఉన్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష, వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్ లుతో కలసి శ్రీకాంత్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు తెలుగు వారందరికీ చిరస్మరనీయుడ న్నారు. 1953 అక్టోబర్ 1 న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని, తొలి బాషా ప్రయుక్త రాష్ట్రంగా నవంబర్ 1, 1956 న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిందన్నారు.పూర్వీకులు మనకు ఇచ్చిన గౌరవాన్ని కొనసాగిస్తూ, తెలుగు ప్రముఖులును గౌరవించుకుంటూ, ఆంధ్రుల చరిత్రను స్మరించుకుంటూ భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా మనమందరం నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి జగన్ పాలన కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, పేదల అభ్యున్నతే ధ్యేయంగా, అర్హులందరికీ సంక్షేమ ఫలాలును అందిస్తూ, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ, భగవంతుడి దీవెనలుతో, ప్రజల ఆశీస్సులుతో విజయబాటలో నడుస్తోందన్నారు.

రాష్ట్రంలో అమలవుచున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్ర అవతరణ కోసం కృషి చేసిన త్యాగధనుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజక వర్గ ప్రజలకు శుభాకాంక్షలు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ కోసం కృషి చేసిన మహానుభావులును మననం చేసుకుంటూ ,వారి స్పూర్తితో రాష్ట్రాభివృద్దికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.సామాన్య ప్రజల కలలను సాకారం చేసే దిశగా జగన్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో ఏ పి ఐ ఐ సి డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి,ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ బేపారి మహమ్మద్ ఖాన్, కౌన్సిలర్లు ఆసీఫ్ అలీఖాన్, కొలిమి ఛాన్ బాష,ఫయాజ్ అహమ్మద్, కసిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి, రాయచోటి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు పబ్బిశెట్టి సురేష్, సాదక్ అలీ,రియాజ్, అన్న సలీం,అంజాద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.