వికారాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం..

వికారాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం..

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో మంచిర్యాల జిల్లాకు చెందిన మహేష్ అనే యువకుడు ఆత్మ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భారతీయ యువ మోర్చా నాయకులు వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా భారతీయ జనతా యువ మోర్చా నాయకులు ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతు తెలంగాణలో నిరుద్యోగులకు ఇక ఉద్యోగాలు రావని తీవ్రమైన మనస్థాపానికి లోనై మహేష్ అనే యువకుడు ఆత్మ హత్య చేసుకున్నాడు. మహేష్ కుటుంబాన్నికి ప్రభుత్వం 20 లక్షలు ప్రకటించాలని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా యువ మోర్చా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహేష్ కుటుంబానికి న్యాయం జరగకపోతే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తాం అన్నారు. ఇంకెంత మంది విదార్థులు ఆత్మ హత్యలు చేసుకుంటే కెసిఆర్ కళ్ళు చల్లబడతాయ్ అని మండిపడ్డారు. వెంటనే రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published.