మున్సిపాలిటీలోని ఆర్ పి ల సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి..

మున్సిపాలిటీలోని ఆర్ పి ల సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి..

ఆర్.బి.ఎం రాయచోటి: స్వయం సహాయక సంఘాల బలోపేతంతోనే ప్రజల జీవన విధానంలో మార్పులు సాధ్యమని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.శుక్రవారం రాయచోటి మున్సిపాలిటీలోని మెప్మా కార్యాలయంలో ఆర్ పి ల తో జరిగిన సమావేశంలో ఎం ఎల్ సి జకీయాఖానం, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష,మున్సిపల్ కమీషనర్ రాంబాబు లుతో కలసి చీఫ్ విప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వాలంబన దిశగా జగన్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.అర్థత ఉన్న స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అందించే ప్రతి పథకం అందేలా చూడాలన్నారు.

ప్రజల జీవితాలలో మార్పు వచ్చేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తున్నామన్నారు.శనివారం నుండి మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభమయ్యే వైఎస్ఆర్ ఆసరా అవగాహన సదస్సులును విజయవంతం చేయాలని సూచించారు. జగన్ పాలన అవినీతి, అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా జరుగుతోందన్నారు. పట్టణంలో అర్హులందరికీ పక్కా గృహాలు మంజూరు అయ్యాయని, అర్హత ఉండి ఇంకా ఇళ్ళు రానివారికి కూడా ఇళ్లు వచ్చేలా కృషిచేస్తామన్నారు.

స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ఆర్ పి లు మరింత కృషిచేయాలని ఆదేశించారు. సీఎం జగన్ తీసుకువచ్చిన దిశ చట్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఎం ఎల్ సి జకీయా ఖానం మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం జగన్ అమలు పరిచారన్నారు.చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కృషితో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు.

మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష మాట్లాడుతూ జగన్ పాలనలో మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతోందన్నారు. మున్సిపల్ కమిషనర్ రాంబాబు మాట్లాడుతూ వై ఎస్ ఆర్ ఆసరా అవగాహన సదస్సుల విజయవంతానికి కృషిచేయాలని సూచించారు. మెప్మా అధికారి నాగరాజు మాట్లాడుతూ మహిళల సంక్షేమం ,స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ ఐ మల్లికార్జున, మెప్మా వైఎస్ ఆర్ సిపి నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్, అన్న సలీం, జాఫర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.